
- సామాన్యుడిపై బారాలు మోపడమే లక్ష్యంగా బడ్జెట్
- తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో మొండి చేయి
- అంకెల గారడితో అభివృద్ధి అంటూ మభ్యపెడుతున్న మోడీ ప్రభుత్వం
- ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
budget 2025 opinion : రైతులను దేశీయ వ్యవసాయాన్ని దివాలా తీయించి కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కుట్రలో భాగంగానే పంటల మద్దతు ధర చట్టం, ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు ప్రస్తావన లేకుండానే కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆందోళనకరమని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ peddarapu ramesh అన్నారు.
- budget 2025 opinion :
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటు ఆచరణలో చేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకమన్నట్లు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించి దోచుకునే విధంగా బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారని దేశానికి వెన్నుముక అయినా దేశీయ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకుండా రైతులు పండించిన పంటలకు కనీసం మద్దతు ధర చట్టం ప్రకటించకుండా పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించకుండా వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిని చేపట్టకుండా దేశ అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.
budget 2025 opinion :
50.65 లక్షల కోట్ల రూపాయల అంచనా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది నామ మాత్రమేనని, పేద మధ్యతరగతి ప్రజల కనీస నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించే విధంగా ధరల నియంత్రణ నిధి ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. యువతకు ఉపాధి కల్పనకు సరైన కార్యాచరణ ప్రకటించకుండా కేవలం చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు మాత్రమే ప్రకటించారని. బీహార్ ఏపీ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కనీస నిధులు కేటాయించకపోవడం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పనులు మాని క్షేత్రస్థాయిలో రైతులకు కూలీలకు కార్మికులకు ఉపయోగపడే బడ్జెట్ గా రూపకల్పన చేసి ఆచరణలో వికసిత్ భారత్ గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.