Blood is the language… Service is
రుధిరం…
మన శరీరంలో ప్రవహించే ద్రవం మాత్రమే కాదు,
అది మనిషి
మనిషికీ
మధ్య
అనుసంధానమైన మౌన ప్రేమ!
ఒకనెత్తురు చుక్క
ఆసుపత్రిలో ఆశా దీప్తిగా మారి ప్రాణం పోస్తుంది
ఒక రక్త దానం
అమ్మ ఒడిలో నవ్వును పూయిస్తుంది!
యుద్ధ గాయాల మధ్య,
విపత్తుల కన్నీళ్ల మధ్య,
మరణ వేదనల దృష్యాల మధ్య
ఆపదల అరుపుల మధ్య—
మానవ
జీవిత చరమాoకపు
దృశ్యాల మధ్య..
ప్రాణ ప్రతిష్ట చేసి
నిశ్శబ్దంగా నిలబడేది
రెడ్ క్రాస్!..
రెడ్ క్రాస్ ఒక చిహ్నం కాదు అది..
ఎరుపు రంగు కాదు అదీ… మనిషి కీ మనిషికీ మధ్య.. ప్రాణం ధరపోసిన
రక్తంతో ఎర్రగా ప్రేమగా చేసుకొన్న మానవతా స్నేహ బందం
రెడ్ క్రాస్!…..
నువు అడగక ముందే నీపై వాస్తల్యంతో
చేతులు చాచి నీకు నీ సమస్త మానవ దేహాలకు ప్రాణం పొయ్యడానికి సంసిద్దమై ఉండే మాతృ సంస్థ రెడ్ క్రాస్
ముఖ పరిచయం లేకపోయినా
ప్రాణాలు కాపాడే ప్రాణదాత రెడ్ క్రాస్
రక్తం అమ్మబడే వస్తువు కాదు,
అది ప్రాణాన్ని పంచుకునే మానవత!
రక్తదానం
బలహీనత కాదు,
అది ఉదాత్త మానవుడి ప్రాణ దానం!
ఒక్క దాత…
మూడు ప్రాణాలకు వెలుగు,
ఒక్క సేవ…
ఒక కుటుంబానికి భవిష్యత్తు!
ఓ నవ యువతా!
మీ అందమైన ఆరోగ్య కరమైన శరీరంలో ఉత్సాహం ఉందంటే..
దానిని రక్తదానంగా మార్చండి!
మీ గుండెల్లో ఈ దేశం ఉందంటే…
దాన్ని.. సమస్త మానవ జాతిని ప్రేమించే
రెడ్ క్రాస్ సంస్థ సేవలో నిలబెట్టండి!
- వనపర్తి పద్మావతి రచయిత్రి – హనుమకొండ 99492 90567
