
Blood donation camp organized by Bahujan Aikya Vedika Kuwait : విశ్వ మానవుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చీకటి బ్రతుకులలో వెలుగు నింపిన గొప్ప మహా మేధావి ఎన్నో అవమానాలు అంటరానితనము ఎదుర్కొని ఒక విద్య వేత్తగా ఒక పరిశ్రమకా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి. ఏప్రిల్ .14. 2025 అనగా 134వ జయంతోత్సవం సందర్భంగా బహుజన ఐక్యవేదిక కువైట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినటువంటి రక్తదాన శిబిరం విజయవంతంగా అంబేద్కర్,వారసులు రక్తదానమే ప్రాణదానమై ముందుకు నడవాలని ఉద్దేశంతో రక్తదానంలో పాల్గొని ప్రాణదాతలయ్యారు ఈ కార్యక్రమాన్ని బహుజన ఐక్యవేదిక కువైట్ అధ్యక్షులు మారే శేఖర్, ఉపాధ్యక్షులు అంజనీ కుమార్ అధికారికంగా ముందుండి నడిపించారు.
Blood donation camp organized by Bahujan Aikya Vedika Kuwait
బహుజన ఐక్యవేదిక కువైట్ అధ్యక్షులు మారే శేఖర్, మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గతంలో కూడా మూడు సంవత్సరాలు రక్తదానం చేసి చేయించి ముందుకు రావడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ప్రత్యేక జై భీములు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా చేసి చేయించి అంబేద్కర్ ఆశాజ్యోతిలై ప్రాణ దాతలు కావాలి అలాగే ఈ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 17న ఘనంగా నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఘనంగా జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్. కాశి సాయి. రవి శ్రీ. దుర్గాప్రసాద్.దివాకర్. గంగు బాయ్. రైల్వే కోడూరు మనీ. నాగేష్.తదితరులు పాల్గొన్నారు.