- ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో కేసీఆర్ ను వేధిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు…
- తెలంగాణ రాష్ట్ర రైతురుణ విమోచన కమిషన్ చైర్మన్ మాజీ నాగూర్ల వెంకటేశ్వర్లు
Blame the innocent Bhagiratha : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు పదేళ్లపాటు తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన మహానేత కేసిఆర్ పై నిందలు వేసి బదులాం చేసేందుకు ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని నాగూర్ల వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీని , పార్టీ నేతలపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ప్రజానీకానికి త్రాగునీరు సాగునీరు అందించి అపర భగీరథుడు గా పేరుందిన కేసీఆర్ ను బదునాం చేయాలని చూస్తే ప్రజలుపేక్షించరని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదని, గత రెండేళ్లుగా విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ, కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పంతాలు మార్చుకోవాలని, ఎన్ని ఇబ్బందులు సృష్టించిన చట్టపరంగా ఎదుర్కొనేందుకు మహానేత కేసిఆర్ కు అండగా ఉంటామని తేల్చి చెప్పారు.
