
Oplus_131072
ఘనంగా కోర శ్రీకాంత్ నాయక్ జన్మదిన వేడుకలు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడపాక గ్రామంలో విద్యుత్తు సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎల్ఎం కోర శ్రీకాంత్ నాయక్ కు గ్రామ యూత్ సభ్యులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారబోయిన అనిల్ మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న శ్రీకాంత్ నాయక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రైతులకు కరెంటు సప్లై చేయడంలో ఎటువంటి జాప్యం లేకుండా అనుక్షణం విద్యుత్తును సరఫరా చేసే సార్ కు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలని సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లక్కం బాబు, మారబోయిన సాంబయ్య, పల్లెబోయిన రాజేందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.