
కుటుంబ కలహాలతో శ్రీకాంత్ అనే వ్యక్తి వరంగల్ అండర్ బ్రిడ్జి రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న ఇంతేజర్గంజ్ పోలీసు స్టేషన్ బ్లూకోట్ కానిస్టేబుల్ “మాట్ల రాజయ్య” సంఘటన స్థలానికి చేరుకొని ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.
గత ఆదివారం రెండు గంటల 45 నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజయ్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టేబుల్ ను పలువురు అభినందించారు.
వివరాల్లోకి వెళితే….శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్యతో గొడవ పెట్టుకొని వరంగల్ అండర్ బ్రిడ్జి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డట్లు శ్రీకాంత్ వాళ్ళ అన్నయ్య 100కు ఫోన్ చేశాడు. 100డయల్ ఫోన్ కాల్ సమాచారంతో వెంటనే కానిస్టేబుల్ రాజయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్యకు యత్నించిన శ్రీకాంత్ మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన (వయస్సు 30 సంవత్సరాలు ) వ్యక్తిగా గుర్తించారు. అనంతరం ఇంతేజర్గంజ్ పోలీసు స్టేషన్ కు తరలించి సీఐ సమక్షంలో సదరు వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.