- గ్రామాల్లో సామాజిక న్యాయం పాట్టించాలని విజ్ఞప్తి
- ఎస్సీలు సర్పంచ్ లుగా గెలుపొందిన చోట బీసీల నుంచి ఉప సర్పంచ్ లుగా కోరంతో పని లేకుండా అవకాశం ఇవ్వాలి
- ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని మనవి
- భూపాలపల్లి నియోజకవర్గంలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి
BCs should be given the opportunity to become deputy sarpanchs : అనాదిగా పేదరికంలో మగ్గుతు చట్టసభల్లో ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా ఉన్న బీసీలు, బీసీ ఉపకులాలకు సర్పంచ్ లుగా ఎన్నికైనా అభ్యర్థులు సంబంధిత పార్టీలు కనీసం ఉపసర్పంచ్ లుగా అవకాశం కల్పించాలని చలివాగు ప్రాజెక్ట్ పెద్దకోడెపాక మత్స్యశాఖ పారీశ్రామిక సహాకార సంఘం మాజీ ఛైర్మెన్, న్యాయవాది ఐరబోయిన బిక్షపతి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలది సామాజిక అనుబంధం అని, ఒఃరినొకరు అర్థం చేసుకుంటూ ఏమైనా సమస్యలు ఉంటే నివారించుకుంటూ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మూడువిడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 7093, బీఆర్ఎస్ 3488, ఇక బీజేపీ, సిపిఐ, సిపిఎం, స్వతంత్ర అభ్యర్థులు మిగతావి గెలుపొందారు ముఖ్యంగా ఈ స్థానాల్లోని ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఉపసర్పంచ్ లుగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నిత్యం సామాజిక న్యాయం గురించి మాట్లాడే అధికార కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో మరింత సామాజిక న్యాయం పాటించాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాల్లోనూ ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో ఉపసర్పంచ్ లుగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో ఎంపిటిసి అభ్యర్థులుగా బీసీలకు తగు ప్రాథాన్యత కల్పించాలని ఆయన కోరారు. పార్టీలకు అతీతంగా బీసీలకు తగు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.
