
మత్స్య శాఖ జిల్లా డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ
Bc garjana sabha Wall poster inagaretion Hanumakonda district ఫిబ్రవరి 2వ తేదిన హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణంలో నిర్వహించే బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ బీసీ గర్జన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2వ తేది నాడు జరగబోయే బీసీ గర్జన సభకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు అన్ని మద్దతు తెలపడం జరిగిందన్నారు. మండల కేంద్రంలో ఉన్న బీసీలు అందరూ స్వచ్ఛందంగా తమ తమ సొంత వాహనాలలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే బీసీ గర్జనకు భారీ ఎత్తున బీసీలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండలంలోని అన్ని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.