- బందు సుజాత – క్రాంతి ప్రచారానికి జనాదర
‘Battery torch’ lights in Bhupalapally Municipality 8th ward : జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు ఎన్నికల ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. ఇన్నాళ్లూ ప్రధాన పార్టీల మధ్యే పోటీ అనుకున్న విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, స్వతంత్ర అభ్యర్థి బందు సుజాత క్రాంతి తన ‘బాటరీ టార్చి’ గుర్తుతో వార్డులో చీకట్లను చీల్చుకుంటూ దూసుకుపోతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన ప్రజలు, ఈసారి స్వతంత్ర గళానికి జై కొట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 8వ వార్డులో కొత్త చరిత్ర లిఖించబడటం ఖాయంగా కనిపిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా 8వ వార్డులో అభివృద్ధి అనేది ఎండమావిగానే మిగిలిపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం తప్ప, గెలిచిన తర్వాత వార్డు సమస్యలను గాలికి వదిలేశారనే అసంతృప్తి ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకుల అంచన. మురికి కాలువలు, తాగునీటి కష్టాలు, కోతుల బెడద, నుంచి విముక్తి లభిస్తుందని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలిందని ఆ వార్డు ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
- వార్డులో దూసుకుపోతున్న ‘బాటరీ టార్చి’
తన గుర్తు అయిన ‘బాటరీ టార్చ్’ ను చేతబూని ప్రతి ఇంటికి చేరుతున్న ‘సుజాత – క్రాంతి’ని ఓటర్లు ఆదరిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. పార్టీ బేషజాలు లేకుండా, సామాన్యురాలిగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ సమస్యలను నమోదు చేసుకోవడం ఓటర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. ధనబలం, అంగబలం ఉన్న పార్టీలు ఒకవైపు సామాన్యురాలిగా ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి మరోవైపు అనే తరహాలో 8వ వార్డు ప్రచారం సాగుతున్న పరిస్థితి. కేవలం జనం బలాన్నే నమ్ముకుని స్వతంత్ర అభ్యర్థి బందు సుజాత క్రాంతి సాగిస్తున్న ఈ ఎన్నికల పోరాటం రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు భావిస్తున్నారు.
ఈసారి 8వ వార్డు ఓటర్లు చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీల పేర్లు చెప్పి కాలయాపన చేసే వారికంటే, తమ సమస్యల కోసం పోరాడే స్వతంత్ర అభ్యర్థికి అవకాశం ఇవ్వడమే మేలని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా యువత మరియు మహిళలు సుజాత క్రాంతి వైపు మొగ్గు చూపుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శిబిరాల్లో కలవరం మొదలైందనే అభిప్రాయాలు వినిపించడం గమనార్హం.
