
AIFDS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్
హనుమకొండలోని బంధన్ హాస్పిటల్ ను తక్షణమే సీజ్ చేయాలని, ప్రాణాలతో చెలగాటమాడిన డాక్టర్ల పైన చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్ కు చెందిన జర్నలిస్ట్ “కృష్ణ” కడుపు నొప్పి వస్తుందని హనుమకొండలోని బంధన్ హాస్పిటల్ కి వెళ్తే ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చేలా వైద్యం చేశారని ఆరోపించారు. ఆ హాస్పిటల్ వైద్యులు అపెండెక్స్ ఆపరేషన్ పేరుతో చేసిన వైద్యం వికటించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడం గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్యం అందించినట్లు తెలిపారు. ఆ సందర్భంగా హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు టెస్టులు చేయగా ఆపరేషన్ ఫెయిల్ అయిందని, బాధితుడైన జర్నలిస్ట్ కృష్ణ పెద్దప్రేగు రంద్రం పడి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని నిర్ధారించారు. దాదాపుగా జర్నలిస్ట్ కృష్ణ చావు అంచులకు వెళ్లి రావడం జరిగిందన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి బంధన్ హాస్పిటల్ ను తక్షణమే సీజ్ చేసి ఆ వైద్యులపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకొని గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు.