
జన నిర్ణయం /శాయంపేట శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని చందా సుధాకర్ తండ్రి చంద్రయ్య అను వ్యక్తిపై ఇదే గ్రామానికి చెందిన చందా ప్రశాంత్ తండ్రి కుమారస్వామి మరియు అతని కుటుంబ సభ్యులు చందా విజయ భర్త కుమారస్వామి ఆకుతోట జ్యోతి భర్త పూర్ణచందర్ ఆకుతోట పూర్ణచందర్ తండ్రి రాజన్న చింతపట్ల రాజు తండ్రి సర్వేశం చింతపట్ల కిట్టు తండ్రి సర్వేశం వీరందరూ కలిసి చందా సుధాకర్ పై దాడి చేసి తలను పగలగొట్టగా వీరిపై శాయంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని సీఐ రంజిత్ రావు తెలిపారు. తేదీ 15- 10- 2025 రోజున ప్రగతి సింగారం గ్రామం వద్ద శాయంపేట ఎస్సై పరమేష్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా నిందితులు పోలీసు వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా ఎస్సై పరమేష్ వారిని అదుపులోకి తీసుకొని పరకాల కోర్టు నందు హాజరు పరచ గా రిమాండ్ కు తరలించామని తెలిపారు.