
- ఎరువులు దొరక్క రైతుల ఇక్కట్లు
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
- కరువైన వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ
Artificial shortage of “urea” in Nallabelli : “పంటల సాగుకు అవసమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాం.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం.. అంటూ సభలు, సమావేశాల్లో పాలకులు, అధికారులు ఊదరగొడుతున్నా…వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా ఎరువుల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రమే సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు”. ఇట్టి అంశంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్రమైన విచారణ చేపట్టాలని పలువురు భావిస్తున్నారు. నల్లబెల్లి మండలంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందనేది గమనార్హం.
.