- మామిండ్ల రమేష్ రాజా రాష్ట్ర కార్యదర్శి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్
Anti-people Union Budget : హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (ఆర్థిక నివేదిక 2026 – 27) పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా మారింది. నివేదికను, కేటాయింపులను పరిశీలిస్తే.. గత కొన్ని ఏళ్లుగా కార్మికులు, రైతులు, గిరిజనులు, విద్యార్థులు, యువకులు, ఇతర రంగాల ప్రజానీకం తమ జీవనోపాధిని మెరుగుపరచాలని, జీవన భద్రతను కాపాడుకోవడానికి లేవనెత్తిన డిమాండ్లు పూర్తిగా ఈ బడ్జెట్లో విస్మరించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాటిని తిరస్కరించింది. కార్పొరేట్ కు మద్దతుగా బడ్జెట్ కేటాయించబడింది. రాష్ట్రాలకు తగిన నిధులు కేటాయించలేదు. హిందుత్వ – కాషాయీకరణ పథకాల అమలు కోసం పూర్తిస్థాయిలో బడ్జెట్ను వినియోగిస్తున్నారు, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని నివేదిక స్పష్టం చేస్తుంది.
