
An unprecedented gathering of alumni భీమదేవరపల్లి మండలం కొత్తకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2000 – 2001 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 25 సంవత్సరాల క్రిందట చదువుకున్న పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఒకరికొకరు కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు ఆట పాటలతో రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు ఉపాధ్యాయులు బోధించిన పాఠశాల విషయాలను నెమరు వేసుకున్నారు చదువు చెప్పిన గురువులు తిరుపతయ్య సోమలింగం నరసయ్య అజయ్ ఎల్లయ్య చంద్రమౌళి రమేష్ మొగిలి అటెండర్ పోచయ్య లను ఘనంగా సన్మానించారు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు మృతిచెందిన ఉపాధ్యాయులు సహ విద్యార్థులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వాహకులు సిద్ధమల్ల అశోక్ కోమాకుల శ్రీనివాస్ లతోపాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.