Amma Ashok’ the tireless traveler : సమాజంలో మార్పు అనేది కేవలం నినాదాలతో రాదు, నిరంతర కృషితోనే సాధ్యమని నమ్మి, తన జీవితంలో ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి అమ్మ అశోక్. పేరులోనే ‘అమ్మ’ అనే మమకారాన్ని నింపుకున్న ఆయన ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక బిడ్డలా ఒక సోదరుడిలా అండగా నిలుస్తున్నారు. 2008లో తెలంగాణ ఉద్యమ సెగల నుండి మొదలైన ఆయన ప్రస్థానం నేడు ఒక మహోన్నత సేవా యజ్ఞంగా కొనసాగుతోంది.
Amma Ashok’ the tireless traveler
రాజకీయ పోరాటం నుండి సామాజిక సేవ వరకు…
శాయంపేట మండలం పెద్దకోడెపాకకు చెందిన అమ్మ అశోక్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీలో చేరిన నాటి నుండి, ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో జరిగిన పోరాటాల్లో అశోక్ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఎదురైన ఎన్నో పోలీసు కేసులు, నిర్బంధాలను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇప్పటికి సుమారు 10కేసుల వరకు ఉన్నట్లు ఆయన పేర్కొంటారు. రాజకీయాలు అంటే కేవలం అధికారం కాదని, అది ప్రజల కష్టాలను తీర్చే ఒక వేదిక అని ఆయన భావిస్తాడు. 2012లో ఆయన సేవలకు అధికారిక గుర్తింపు లభించాక, తన సేవా పరిధిని మరింత విస్తృతం చేశారు. అమ్మ అశోక్ సేవా గుణానికి నిదర్శనం ఆయన చేపట్టే మానవతా కార్యక్రమాలే. రోడ్ల పక్కన దిక్కులేక తిరుగుతున్న వారికి ఆహారం అందించి, వారిని సురక్షితంగా అనాథాశ్రమాలకు చేర్చడంలో ఆయన ముందుంటారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి (SSC కిట్లు), క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేస్తూ భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తున్నారు. ఇప్పటివరకు 53 సార్లు రక్తదానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లో మరణం సంభవిస్తే సన్నబియ్యం, ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాలకు కొండంత అండగా నిలువటం ఆయన సహజ తత్వం.
అమ్మ అశోక్ చేస్తున్న నిస్వార్థ సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. ఆయన సేవా నిరతిని గుర్తించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండుసార్లు ఉత్తమ సామాజిక సేవకుడిగా అవార్డులు అందుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. అశోక్ సేవా స్ఫూర్తిని మెచ్చుకుంటూ కల్వకుంట్ల కవిత ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, తన సేవ ద్వారా అగ్రనాయకుల ప్రశంసలు పొందడం గమనార్హం.
Amma Ashok’ the tireless traveler
లోకమంతా ప్రాణభయంతో వణికిపోయిన కరోనా విపత్తు సమయంలో, అశోక్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్యే ఉండి సేవలు అందించారు. అలాగే, రైతు పక్షపాతిగా తనకు వచ్చే రైతుబంధు నిధులను సైతం నిరుపేద రైతులకు అందించడం ఆయన ఔదార్యానికి పరాకాష్టగా చెప్పొచ్చు. నిస్వార్థమైన సేవ, మొక్కవోని అంకితభావం అమ్మ అశోక్ ని ఒక సామాన్య వ్యక్తి నుండి ఒక గొప్ప ప్రజా నాయకుడిగా మార్చాయి. పదవుల కంటే ప్రజల ప్రేమే మిన్న అని భావించే అశోక్ ప్రస్థానం నేటి యువతకు ఒక దిక్సూచి. ఆయన చేస్తున్న ఈ సేవా యజ్ఞం ఇలాగే కొనసాగుతూ సమాజంలో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షిద్దాం.
