
Warangal district నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని,76వ గణతంత్ర దినోత్సవo పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్నా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు . ప్రపంచ మేధావి డా: బి ఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి స్ఫూర్తి అంబేద్కర్ రాజ్యాంగం అని అన్నారు. ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలాలు అనుభవిస్తున్నారంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ద్వారానేనని అన్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజల కోసం కులాలకు, మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అందించిన మహానుబావుడు అంబేద్కర్ గారని, వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ,మండల పార్టీ అధ్యక్షులు బానోతు సారంగపాణి, పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీ,మాజీ ఎంపీపీ లు, దళిత సంఘాల నాయకులు,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.