
- చదువు సగం సగమే..!
- హనుమకొండ నయీంనగర్ బ్రాంచ్ “ఆల్ఫోర్స్” మాయాజాలం…
- ఉత్తీర్ణత కంటే ఫెయిల్యూర్ లే ఎక్కువనే ప్రచారం…
- విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైనం…
“Allforce” in the name : అల్ఫోర్స్ ఉత్తర తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థ. ఇంటర్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఐఐటీ, తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో హైదరాబాద్ లాంటి మహానగంలోని కార్పొరేట్ విద్యా సంస్థలను సైతం అధిగమిస్తూ ఫలితాల్లో ముందుంటున్నామని గొప్పలు చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడం తెలిసిందే. ఇదంతా నిజమేనని భావించి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మంచి భవిష్యత్ కోసం డబ్బుకు వెనకాడకుండా అల్ఫోర్స్ లో చేర్పిస్తుంటారు. కానీ హనుమకొండ నయీంనగర్ ఆల్ఫోర్స్ బ్రాంచ్ పరిస్థితి చూస్తే ఇదంతా డొల్లె అనేది తేలిపోతుంది. నయీంనగర్ “ఆల్ఫోర్స్” బ్రాంచ్ పేరుకే తప్ప ఆ బ్రాంచ్ లో చదువు సగం సగమేనని అక్కడ ఉత్తీర్ణత కంటే ఫెయిల్యూర్ లే ఎక్కువనే ప్రచారంలో నిజం లేకపోలేదు.
“Allforce” in the name
హనుమకొండ నయీంనగర్ బ్రాంచ్ “ఆల్ఫోర్స్” మాయాజాలం అంతా ఇంతా కాదనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఐఐటి, జెఈఈ మెయిన్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మాయాజాలం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిఆర్వోలతో విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పిస్తూ అడ్మిషన్లకు కొత్త దారులు వేయడం ఆల్ఫోర్స్ కే చెల్లిందని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
“Allforce” in the name
మరోవైపు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కూడా ఉత్తీర్ణత సాధించలేని స్థితిలో “ఆల్ఫోర్స్” అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టే మాయాజాలంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆ బ్రాంచ్ పరిస్థితిని ఏమాత్రం పరిశీలించినా ఇట్టే తేలిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.