
- ఆ తహశీల్దార్ రాజ్యంలో అన్నీ “కృష్ణ లీలలే”నంటూ ప్రచారం…
- సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ తతంగంపై వ్యక్తమవుతున్న అనుమానాలు…
- తల్లిని నమ్మించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారసుడు…
- రొడ్డేక్కిన తల్లి, అన్నదమ్ములు…
- నల్లబెల్లిలో చర్చానీయాంశంగా మారుతున్న తహశీల్దార్ వ్యవహారం…
Allegations against Nallabelli Tahsildar : నిజమే కావచ్చు. ఆ తహశీల్దార్ కు ఆ రైట్ ఉండొచ్చు. నిబంధనల ప్రకారం ఆయన చేసింది చూడటానికి, వినటానికి నిజమే అనిపించొచ్చు. క్రయ విక్రయాలు (సేల్ డీడ్) రిజిస్ట్రేషన్ అమ్మకందారు, కొనుగోలుదారు, ఇద్దరు సాక్షులు తహశీల్దార్ ముందు హాజరై సంతకాలు, వేలి ముద్రలు తీసుకొని సమ్మతమైతే ఎలాంటి విచారణ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందనేది నిజమే కావచ్చు. కానీ భూమిని అమ్మినట్లు అమ్మిన ఆ వృద్దురాలికే తెలియకపోతే ఎలా..? పైగా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరిని కాదని రెండో కుమారుని భార్య కు అమ్మడం, ఆ బాధిత వృద్ధురాలికే తెలియకుండా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ తహశీల్దార్ చేయడమే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక్కడ బాధిత వృద్ధురాలు, ఆ వృద్ధురాలి మరో ఇద్దరు కుమారులు రొడ్డెక్కడం చర్చానీయాంశంగా మారుతోంది.
Allegations against Nallabelli Tahsildar
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో తహశీల్దార్ చేసిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ వ్యవహారం చర్చానీయాంశంగా మారుతోంది. తనకు తెలియకుండానే తన భూమిని తన కోడలికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేశారంటూ రుద్రగూడెం గ్రామానికి చెందిన లద్దునూరి సూరమ్మ అనే మహిళా అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఫించన్ పేరుతో తహశీల్దార్ కార్యాలయానికి తన రెండో కుమారుడు తీసుకొచ్చి భూమి అమ్మినట్లు సంతకాలు తీసుకున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు, ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతోపాటు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం సైతం భీష్మించుకొని కూర్చోవడంతో చర్చకు తావిస్తోంది.
Allegations against Nallabelli Tahsildar
మే 23, 2025న రుద్రగూడెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 38/1/2// మరియు 39/2/1 విస్తీర్ణం 1. 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించిన సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం అమ్మకందారు లద్దునూరి సూరమ్మ, కొనుగోలుదారు అయిన లద్దునూరి ప్రపూర్ణ స్లాట్ బుక్ చేసుకున్నారని, మే, 29, 2025న ఇద్దరు సాక్షులతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారని, దీంతో డీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెo. 280/2025 ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తహశీల్దార్ నిబందనల సూత్రాలు చెప్తున్నప్పపికీ, తమ వివరాణాత్మక పోస్టులు పెట్టినప్పటికీ అసలు రహస్యం ఆ తహశీల్దార్ కు తెలిసే జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపించటం గమనార్హం.
Allegations against Nallabelli Tahsildar
అయితే ఆ వృద్ధురాలి వయస్సు చూసైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమమా అక్రమమా అనేది తహశీల్దార్ (Tahsildar) పరిశీలించకపోవడం ఆయనకే చెల్లింది. అయితే ఇదంతా తహశీల్దార్ కు తెలిసే జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో చేసిందంతా చేసి కోర్టులో తేల్చుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ తహశీల్దార్ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందనేది గమనార్హం.
Allegations against Nallabelli Tahsildar
- సమగ్రమైన విచారణ చేపట్టాలి
పరికి కోర్నేలు – అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
నల్లబెల్లి తహశీల్దార్ పనితీరు పట్ల ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాలి. ముగ్గురు కొడుకులకు సమానంగా రావాల్సిన వారసత్వ భూమిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బాధితురాలి రెండో కుమారుని భార్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేయటం తహశీల్దార్ కే చెల్లింది. తహశీల్దార్ చెప్పేవన్నీ కట్టు కథలే. అంతా తహశీల్దార్ కనుసన్నల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇదేంటని బాధితురాలి పక్షాన వివరణ అడిగితే దురుసుగా ప్రవర్తించారు . ఇది తహశీల్దార్ ఏమాత్రం సరైనది కాదు. తక్షణమే తహశీల్దార్ పనితీరు పట్ల సమగ్రమైన విచారణ చేపట్టాలి. బాధితురాలికి న్యాయం చేయాలి.
Allegations against Nallabelli Tahsildar
- తహశీల్దార్ పనితీరు పట్ల విచారణ చేపట్టాలి
పోలె పాక అరుణ్ – అణగారిన వర్గాల ఐక్యవేదిక నల్లబెల్లి మండల నాయకులు
ఇదొక్కటే కాదు అనేక అంశాల్లో తహశీల్దార్ రూటే సపరేట్ అన్నట్లుగా ఉంటుంది. బాధితురాలు వృద్ధురాలు. ఆమె వయస్సు చూసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అవసరం ఏంటనేది తహశీల్దార్ పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేయటం పైగా ఆయన చేసిన పనిని సమర్దించుకోవటం తహశీల్దార్ కే చెల్లింది. తక్షణమే తహశీల్దార్ పై విచారణ చేపట్టాలి. ఇదొక్కటే కాకుండా ఆయన విధుల పట్ల క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పొలిటికల్ సపోర్ట్ ఉందనే తరహాలో ముందుకు సాగుతున్న తహశీల్దార్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది.
*************