
Oplus_131072
- నల్లబెల్లిలో విచ్చలవిడి మద్యం అమ్మకాలు..!
- చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు..!!
All alcohol is adulterated at any time : అక్కడ ఎనీ టైం మద్యం అమ్మకాలు జరుగుతాయి. అర్థరాత్రి అయినా… తెల్లవారుజామున అయినా ఎప్పుడంటే అప్పుడు 24/7 మద్యం అందుబాటులో ఉంటుంది. కల్తీ కూడా జరుగుతుంది. ఇదీ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని వైన్ షాప్ ల నిర్వహణ తీరు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అలసత్వంతో మద్యం క్రియ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతుండటం బహిరంగ రహస్యంగా మారిందని పలువురు భావిస్తున్నారు. ఇంకా ఒకడుగు ముందుకేసిన మద్యం షాపుల నిర్వాహకులు మద్యాన్ని యధేచ్ఛగా కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నల్లబెల్లి మండలంలోని వైన్ షాపుల్లో యధేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పటికీ, కల్తీ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చూడటం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికైనా నల్లబెల్లి మండల కేంద్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు, కల్తీ మద్యం వ్యాపారం పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివారించాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.