
- పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా “ఆల్ఫోర్స్” నయీంనగర్ బ్రాంచ్..!
- విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న “ఆల్ఫోర్స్” విద్యాసంస్థ అనే ఆరోపణలు…
- హనుమకొండ నయీంనగర్ బ్రాంచ్ ఆల్ఫోర్స్ లో ఉత్తీర్ణత కంటే ఫెయిల్యూర్ లే ఎక్కువనే ప్రచారం.,!!
- ఐఐటి, జెఈఈ మేయిన్స్ పేరుతో మాయాజాలం…
- పిఆర్వోలతో విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పిస్తూ అడ్మిషన్లకు కొత్త దారులు….
- డిఐఈఓ, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలంటున్న పలువురు….
“Alfors” is all Dolle : హనుమకొండ నయీంనగర్ ఆల్ఫోర్స్ విద్యాసంస్థ “పేరు గొప్ప ఊరు దిబ్బ” అన్న చందంగా మారిందా..? అనుకున్న స్థాయిలో రిజెల్ట్స్ లేకపోయినా తమ బ్రాండ్ ఇమేజ్ తో కవర్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారా అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇందుకు నయీంనగర్ “ఆల్ఫోర్స్” విద్యాసంస్థకు చెందిన నయీంనగర్ బ్రాంచ్ పరిస్థితి సాక్ష్యంగా నిలుస్తోందని పలువురు భావిస్తున్నారు.
“Alfors” is all Dolle..
ఈ బ్రాంచ్ లో ఉత్తీర్ణత కంటే ఫెయిల్యూర్ లే ఎక్కువనే ప్రచారం కూడా సాగుతోంది. ఐఐటి, జెఈఈ మేయిన్స్ పేరుతో మాయాజాలం చేస్తూ పిఆర్వోలతో విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పిస్తూ అడ్మిషన్లకు కొత్త దారులు వేయడం ఆల్ఫోర్స్ కే చెల్లిందని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు కూడా ఉత్తీర్ణత సాధించలేని స్థితిలో “ఆల్ఫోర్స్” అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టే మాయాజాలంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆ బ్రాంచ్ పరిస్థితిని ఏమాత్రం పరిశీలించినా ఇట్టే తేలిపోయిందనేది కాదనలేని వాస్తవం.
“Alfors” is all Dolle..
ఇంకోవైపు ఐఐటీ, జేఈఈ మెయిన్స్ పేరుతో అధిక ఫీజులు వసూళ్లు చేయడం, అరకొర సౌకర్యాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం నయీంనగర్ ఆల్ఫోర్స్ బ్రాంచ్ కే చెల్లిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా డిఐఈఓ, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.