
Aituc telangana state conference తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర రెండవ మహాసభలను ఈనెల 30, 31 వ తేదీలలో కోరుట్లలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అనుకారి అశోక్ కోరారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ బీడీ కార్మికులు అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉంటే కనీస కూలీ రేటు లేదని రిటర్మెంట్ అయినా వారికి నెలకు ₹7000/- రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బహిరంగ సభకు సంబంధించి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ అనుబంధ కార్యకర్తలు మరియు పరకాల ఆత్మకూర్, ములుగు శాయంపేట మండలాల్లోని అసంఘటిత బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని సదానందం .మరియు కార్యకర్తలు అంకుల్ షావలి భోగి రమ, నన్నాబి, నరేష్, కొమురయ్య, రాజేశ్వరి ,కల్పన, దేవా రావు, సమ్మయ్య ,సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.