
- దుమారం రేపుతున్న ఏడిఈ అక్రమ ప్రమోషన్ వ్యవహారం…
- ఏడీఈ అక్రమాలు… అక్రమాస్తుల ఆరోపణలపై తీవ్ర చర్చ…
- గతంలో జైలుకు వెళ్లి వచ్చినా అదే పోస్టులో దర్జాగా ఉద్యోగం..
- కొడుకు ఓ మంత్రి ఓఎస్డి కావడంతో ఎవరేం చేయలేరనే ధీమాలో ఆ అధికారి..?
ADE of irregularities in TG NPDCL : ఆ ఏడీఈ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. టిజి ఎన్పీడిసిఎల్ లో అసోసియేషన్ నాయకుడిగా చెలామణి అవుతున్న సదరు అధికారి ఆ పదవిని అడ్డుపెట్టుకుని తన ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ ఉద్యోగిగా మొదలైన తన ప్రస్థానం అక్రమంగా అనేక ప్రమోషన్ లతో ముగియనున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత సిఎండి హయాంలో ఓ వెలుగు వెలిగిన సదరు ఏడిఈ అక్రమంగా అనేక ఆస్తులను బినామీ పేర్లతో కూడబెట్టినట్లు ఎన్పీడిసిఎల్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో కోడలి కేసులో జైలుకు వెళ్లిన అధికారి తిరిగి అదే పోస్టులో దర్జాగా కొనసాగినట్లు సమాచారం. అసోసియేషన్ నాయకుడు కావడం, కొడుకు ఓ మంత్రికి ఓఎస్డీగా ఉండడంతో తనను ఎవరూ ఏం చేయలేరనే ధీమాతో సదరు అధికారి ఉన్నట్లు విద్యుత్ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ADE of irregularities in TG NPDCL
- ప్రమోషన్ వెనుక మర్మమేమిటి..?
- ప్రచారం జరుగుతున్నట్లు భారీగా అక్రమాస్తులు బినామీ పేర్లతో కూడబెట్టారా..?
- మాజీ సిఎండి ఈ ఏడిఈకి ఎందుకు అంతలా సహకరించారు…
- జైలుకు వెళ్లివచ్చినా ఎందుకు సస్పెండ్ కాలేదు?
- బినామీ ల పేర్లతో కాంట్రాక్టులు..? ఏ వర్కులో ఎలా దోచుకున్నారు..?
సంచలన కథనం మీ జన నిర్ణయం పత్రికలో..