- హైస్కూల్ అనుమతికై లంచం డిమాండ్
- అదనపు కలెక్టర్ సహా, జిల్లా విద్యాశాఖ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు
Additional Collector caught by ACB హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ శుక్రవారం సాయంత్రం ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డారు. నగరంలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఒక హైస్కూల్ అనుమతి కోసం వెంకటరెడ్డి రూ.60 వేలు డిమాండ్ చేసిన నేపథ్యంలో స్కూల్ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం డబ్బులు ఇస్తానని స్కూల్ యజమాని చెప్పడంతో విద్యా శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను లంచం డబ్బులు తీసుకురావాల్సిందిగా వెంకటరెడ్డి ఆదేశించాడు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటున్న వెంకట్ రెడ్డి, మనోజ్, విద్యాశాఖకు చెందిన గౌస్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడం చర్చానీయాంశంగా మారింది.
