- డిబిఎఫ్, డిఎచ్పియస్ నేతలు చుంచు రాజేందర్, సంఘి ఎలేందర్
Action should be taken against the miscreants who demolished the Phule statue : వరంగల్ జిల్లా కరీమాబాద్,ఉర్సూ కేంద్రంలో భారత దేశ సంఘ సంస్కర్త పీడితులకు,అణగారిన వర్గాలకు విధ్యను అంకూరార్పణ చేసిన పుణ్య మూర్తి మహాత్మా జ్యోతి రావ్ పూలే అని, పూలే విగ్రహాన్ని కూల్చిన దుండగులపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి,చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని,ప్రభుత్వమే పూలే నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్)రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, డిఎచ్ పియస్ జిల్లా అధ్యక్షులు సంఘి ఎలేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యాంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చుంచు రాజేందర్, ఎలేందర్ మాట్లాడుతూ సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఉర్సూ ప్రాంతంలోని మసీదు దగ్గర ఉన్నటువంటి మహాత్మా పూలే విగ్రహాన్ని ద్వంసం చేయడం జరిగిందని,ఇంతకుముందు ఒకసారి ఇదే పూలే విగ్రహాన్ని దుండగులు కూల్చడం జరిగిందని,ఇది రెండవ సారి కూల్చివేత చేయడం సబ్యసమాజం సిగ్గుతో తలదించుకోనేలా వ్యవహరించడం హేయమైన చర్యన్నారు. ఈ దేశ మూల వాసుల అస్థిత్వావాలను దెబ్బతీస్తూ,మహానీయుల విగ్రహాలను కూల్చడమే ద్వేయంగా మనువాధం పనిచేస్తుందని,విగ్రహలను కూల్చిన దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందన్నారు. పూలే విగ్రహాన్ని కూల్చిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోని,ప్రభుత్వమే పూలే నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతి రావ్,సామాజిక న్యాయవేధిక రాష్ట్ర నాయకులు కేడల ప్రసాద్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల రవి కుమార్,బిఎల్ఎఫ్ జిల్లా నాయకులు ఐతం నగేష్,బిఎస్పి నాయకులు నాగరాజు,బిసి సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
