
- ములుగు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కు ఫిర్యాదు
Action should be taken against “Sravanthi Hospital” : ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డిఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ గోపాల్ రావుకు పలువురు ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్ ల్లో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు రెంటాల బిక్షపతి, మేకల మహేందర్, సురేష్, నరేష్ తదితరులు బృందం డిఎం అండ్ హెచ్ఓ కు వినతి పత్రం అందజేశారు. కనీస సౌకర్యాలు లేకుండా ఎలాంటి ల్యాబ్స్ పరీక్షలు చేయకుండా ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని, అత్యాధునిక పరికరాలు ఉన్నాయని నమ్మబలుకుతూ యధేచ్ఛగా వైద్య వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
Action should be taken against “Sravanthi Hospital”
దళిత గిరిజన పేద మధ్య మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ నాసిరకం వైద్యం అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్రవంతి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటివల ఓ మహిళకు వైద్యం వికటించిన ఉదాంతం చర్చానీయాంశంగా మారిందని, గత వారం కిందట నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్రవంతి ఆసుపత్రిలో చికిత్స పొందిన మూడు రోజులకే మృతి చెందిన ఘటన ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరుగునపడ్డవి ఎన్నో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే స్రవంతి హాస్పిటల్ పై సమగ్రమైన విచారణ చేపట్టి ఆ హాస్పిటల్ ను సీజ్ చేయాలి డిమాండ్ చేశారు.