
క్షతగాత్రులను ఆసుపత్రి తరలించిన సీఐ పుల్యాల కిషన్
Hanumakonda హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం ఔటర్ రింగ్ రోడ్డుపైన మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాళ్లు విరిగిపోయినట్లు, ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న pulyala kishan సీఐ పుల్యాల కిషన్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.