
వలవేసి పట్టాలేగాని రోజు ఎన్నో దొరుకుతాయి..!!
ACB caught up with the police : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టు బడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంధ్య వెంకట్ రావు నుండి ఒక పని నిమితం రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్క సమాచారం మేరకు పన్నిన వల్లో లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ ఏసీబీ టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి నుండి లంచం డిమాండ్ చేశారు. మక్తల్ సర్కిల్ సీఐ జి. చంద్రశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లు సింగాసాని శివరెడ్డి, నరసింహ బాధితుల నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజల హక్కులను చట్టబద్ధంగా కాపాడాల్సిన పోలీసులే అవినీతి కూపంలో కూరుకుపోతూ మూడు సింహాల సింబాలిక్ కు తల వంపులు తెస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.