
- ఒక్కొక్కటిగా బయటపడుతున్న తహశీల్దార్ అక్రమాలు…
- గతంలో విధులు నిర్వహించిన ఖిలా వరంగల్, కాజిపేట మండలాల్లో అనేక అక్రమాలకు పాల్పడిన అధికారి…
- ప్రస్తుతం వరంగల్ జిల్లాలో తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న అవినీతి” కిరణం”..!
A whale of corruption in revenue : రెవెన్యూశాఖలో ఆ తహశీల్దార్ ను అవినీతి తిమింగలంతో పోల్చవచ్చు. ఆ తహశీల్దార్ ఎక్కడ విధులు నిర్వహించినా తనకు కావాల్సింది ఇస్తే ఎలాంటి అక్రమాలనైనా చేయడంలో దిట్ట అని తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని ఓ మండల తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి గతంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలోని ఖిలావరంగల్, కాజిపేట మండలాల్లో అక్రమార్కులకు గట్టిగానే సహకరించినట్లు సమాచారం.
A whale of corruption in revenue
ఖిలా వరంగల్ తహశీల్దార్ గా విధులు నిర్వహించిన సమయంలో సదరు తహశీల్దార్ చేసిన తప్పులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు(పదుల సంఖ్యలో) ఇప్పటికీ అదే కార్యాలయం చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.అంతేకాకుండా ఈ అధికారి కాజిపేట మండల తహశీల్దార్ గా విధులు నిర్వహించిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలకు పాల్పడిన సదరు తహశీల్దార్ ఓ భూమికి సంబంధించిన పాస్ బుక్ లు జారిచేయడం కోసం చనిపోయిన వ్యక్తులనే సాక్ష్యులుగా సంతకాలు కూడా పెట్టించడం గమనార్హం.
A whale of corruption in revenue
ఎక్కడ విధులు నిర్వహించినా అందినకాడికి దండుకొని అక్రమాలకు పాల్పడే సదరు తహశీల్దార్ పై విజిలెన్స్ అధికారులు కనుక దృష్టి సారించి ఖిలా వరంగల్, కాజిపేట మండలాల్లో ఈయన విధులు నిర్వహించిన కాలంలో జరిగిన పనుల (పాస్ బుక్ లు, తదితరములు..)పై క్షుణ్ణంగా తనిఖీ చేస్తే తహశీల్దార్ బండారం బయటపడే అవకాశం ఉందని సమాచారం.
A whale of corruption in revenue
- నిబంధనలకు పాతర… అక్రమాల జాతర…
- ఖిలా వరంగల్, కాజిపేట మండలాల్లో తహశీల్దార్ చేసిన అక్రమాలు…. ఏ గ్రామం, ఏ సర్వే నెంబర్ లలో ఎలా చేశారు..?
- అవినీతి “కిరణం” పై ప్రత్యేక కథనాలు” జన నిర్ణయంలో…