
- పీఏసీఎస్ అక్రమాల విచారణపై ప్రశ్నించిన జర్నలిస్ట్ పై దాడికి యత్నం
- జర్నలిస్టు పై విరుచుకుపడ్డ పీఏసీఎస్ ఛైర్మన్ తమ్ముడు…
- ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న వైనం…
Journalist vs pacs chairman : వరంగల్ జిల్లా నల్లబెల్లి పీఏసీఎస్ లో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై ఛైర్మన్ తమ్ముడు అనుచరులు దాడికి యత్నించారు. అక్రమాల గురించి అడగడానికి ఎంత ధైర్యం అంటూ భౌతిక దాడికి సిద్దమయ్యాడు. దీంతో ఛైర్మన్ తమ్ముడు, వారి అనుచరులపై జర్నలిస్టు, జర్నలిస్టుపై ఛైర్మన్ అనుచరులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం చర్చానీయాంశంగా మారింది. ఈమేరకు పీఏసీఎస్ వ్యవహారంలో సంబంధిత అధికారులు, రైతులు, పీఏసీఎస్ పాలకవర్గం డైరెక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులను పీఏసీఎస్ అక్రమాలపై ఏం తేల్చారని ప్రశ్నించినందుకు సదరు జర్నలిస్టు పై పీఏసీఎస్ ఛైర్మన్ తమ్ముడు బహిరంగంగా దాడికి యత్నించడం చర్చానీయాంశంగా మారుతోంది. ఇట్టి విషయంలో ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాలి పలువురు భావిస్తున్నారు. ప్రశ్నించిన జర్నలిస్ట్ పై భౌతిక దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సదరు జర్నలిస్టుకు అండగా నిలువాలని కోరుతున్నారు.