
Pacs ఛైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్ రావు
Nallabelly pacs development : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామంలో శుక్రవారం ఎర్పాటు చేసిన మహాజన కార్యక్రమంలో pacs పాలకవర్గం సమయ పాలన ముగింపు సభ ఛైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్ రావు అధ్యక్షతన జరిగింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలక వర్గం పనిచేసిందని, కొంత మంది వ్యక్తులు కావాలని సొసైటీపై బురద చల్లుతున్నారని అన్నారు. Pacs ద్వారా చాలా మంది రైతులకు లబ్ధి చేకూరిందని. Pacs ద్వారా నల్లబెల్లి మండల కేంద్రంలో Dccb బ్యాంక్, పెట్రోల్ బంక్ ఏర్పాటు జరిగిందన్నారు. అభివృద్ది పరంగా నల్లబెల్లి సొసైటి ముందంజలో ఉందని అన్నారు . సొసైటి పై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులకు ప్రజాక్షేత్రంలో తప్పకుండ గుణపాటం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, పాలక వర్గం, రైతులు తదితరుల పాల్గొన్నారు