
- రైతుల పేరుతో రాజరికం..!
- రుణాల రినివల్స్ అక్రమాలు..!!
- అక్రమాలు విచారణలో తేలినా తీరుమారని వైనం…
- కొందరు రైతుల పట్ల కక్షసాధింపుగా వ్యవహరిస్తున్న పిఎసిఎస్ పాలక పెద్దమనిషి…
- రైతుల నష్టాన్ని తీర్చడంలో వివక్ష….
“Murali” leelas in nallabelly “pacs” రైతు రుణాలను రైతులకే తెలియకుండా, మరికొన్ని బినామీ పేర్లతో కొల్లగొట్టిన వ్యవహారం వరంగల్ జిల్లా నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్ )లో వెలుగులోకి వచ్చి అప్పట్లో దుమారం లేపిన విషయం తెలిసిందే. రాజకీయ దన్ను చూసుకొని ఉద్యోగులు, పాలక వర్గాలు కుమ్మక్కయి రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సమగ్రమైన విచారణ కూడా జరిగింది. నష్టపోయిన రైతులు న్యాయం కోసం పోలీసులను, సంబంధిత అధికారులను సైతం ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టగా నల్లబెల్లి పిఎసిఎస్ ఛైర్మన్, సిఈఓ కుమ్మకై రైతుల పేరుతో రుణాలు కాజేసినట్లు తేలడంతో ఛైర్మన్, సిఈఓలపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే అవినీతి అక్రమాలు ఇంత బహిరంగంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కేసులు నమోదు చేయడం వరకే పరిమితమై కాలం సాగదుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“Murali” leelas in nallabelly “pacs”
మరోవైపు నష్టపోయిన రైతుల్లో కొందరికి పిఎసిఎస్ ఛైర్మన్ పాలకవర్గం తూరుపున నష్టపరిహారం కూడా చెల్లించి సమస్యను సద్దుమనిగే వ్యూహం పన్నారు. కొందరు రైతులతో మంతనాలు జరిపి నష్టపరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. అయితే కొందరు రైతుల పట్ల ముఖ్యంగా తనపై పోలీసులకు పిర్యాదు చేసిన రైతుల్లో ఒక రైతు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పలు సందర్భాల్లో నష్టపరిహారం చెల్లిస్తానని పోలీసు కేసు రాజీ పడాలని చర్చలు కూడా జరిపిన ఛైర్మన్ సాగదీతతో కాలం గడుపుతున్నట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నల్లబెల్లి పిఎసిఎస్ లో జరిగిన రైతు రుణాల గోల్ మాల్ కు కారకులైన వారిపై విచారణ, కేసుల నమోదు వరకే పరిమితం కాకుండా చర్యలు చేపట్టాలని, బాధిత రైతులు కోరుతున్నారు.