
Hanumakonda district kazipet mandal హనుమకొండ జిల్లా కాజిపేట్ మండలం రహమత్ నగర్ లో మెద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు హైదరాబాదులో సరూర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9 న అదివారం జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కరేటే పోటీలలో మెద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి,10 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్, సాధించారనీ మెద కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ వి.మధుకర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. పథకాలను సాధించిన విద్యార్థిని,విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రవీణ్య ,డి.ఓ వాసంతి సన్మానించారు. విద్యార్థులు కరాటే పోటీలలో ఇన్ని మెడల్స్ తీసుకురావడం గౌరవంగా ఉందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు కరాటే నేర్చుకోవడం వలన సెల్ఫ్ డిఫెన్స్ పెరుగుతుందని ఇది జివీతంలో ఎక్కడైనా ఉపయోగపడుతుందని అన్నాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీం సమగ్ర శిక్ష సెల్ఫ్ డిఫెన్స్ స్కీం ద్వారా మహిళలకు ఉచితంగా కరాటే శిక్షణను ఇస్తుందని, దానిని ప్రతి ఒక్క మహిళా క్రీడాకారిని సద్వినియోగం చేసుకోని ఆత్మస్థైర్యం పెంచుకోవాలని. కరాటే నేర్చుకోవడం వలన మహిళలకు ఆత్మస్థైర్యం పెరిగి తమను తాము రక్షించుకునే ఆయుధంగా కరేటే క్రీడ ఉపయోగపడుతుందని అన్నారు. కరేటే మాస్టర్ ఐ.రామ్మోహన్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు కటాసు స్పారింగ్ సెల్ఫ్ డిఫెన్స్ స్కూల్ లైఫ్ లోనే నేర్చుకోవాలని, స్కూల్ లైఫ్ లో నేర్చుకోవడం లో చాలా ఉపయోగం ఉంటుందని తెలియజేశారు