
Poor sanitation in nallabelly mandal : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాలలో పారిశుద్ధ్య పనులు పడకేస్తున్నాయి. మండలంలోని గ్రామాలలో ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి మురుగునీరు, చెత్త చెదారం దర్శనమిస్తున్నాయి. దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. అధికారులు కనీసం మురుగునీరు చెత్తాచెదారం ఉన్న దగ్గర కనీస చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలతో పంచాయతీ కార్యదర్శులు చెలగాటమాడుతూన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Poor sanitation in nallabelly mandal : గ్రామాల్లో మల్టీపర్పస్ గ్రామపంచాయతీకి ఐదు నుండి ఆరుగురు ఉన్నప్పటికీ అందులో పని చేసేది ముగ్గురు మాత్రమే మిగిలిన వారు ఏం చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులకు తప్ప ఎవరికి ఏం తెలియదు ఈ ముగ్గురు కార్మికులు ఒక గ్రామాన్ని పారిశుద్ధం వెంట వెంటనే చేయడం ఎలా సాధ్యమవుతుంది ఆని, ఆయా గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ అన్నప్పుడు అందరు పనిచేయాల్సి ఉండగా కొందరికి మినహాయింపు ఎందుకు ఉంటుందో పంచాయతీ అధికారుల తోపాటు , మండల స్థాయి అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది,అని పలు గ్రామాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధాన్ని పరిగెత్తించాలని స్థానికులు మండల ప్రజలు కోరుకుంటున్నాను