
- టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్న భూ బాధితులు…
- చర్చానీయాంశంగా మారుతున్న పసరగొండ శివారులోని వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం తీరు…
Venkateshwara stone crusher land victims protest : అక్కడ భూ బాధితులు గత నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. తమ భూమిని అమ్ము పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ఎగనామం పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడునాలుగు ఏండ్లుగా ఇదే తంతు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ శివారులోని వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం తీరు.
Venkateshwara stone crusher land victims protest :
గత కొన్నేళ్ల కిందట స్టోన్ క్రషర్ పరిసర ప్రాంతంలోని సుమారు 75ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. స్థానికులకు చెందిన ఇట్టి భూమిని కొనుగోలు చేసి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో అసలు పంచాయితీ మొదలైంది. నెలలు, ఏండ్లు గడిచినా పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో బాధితులు టెంట్ వేసుకొని నిరసనకు దిగడం చర్చానీయాంశంగా మారుతోంది. సహజవనరులను కొల్లగొట్టడమే కాకుండా భూ బాధితులను సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ స్టోన్ క్రషర్ నిర్వహణ సైతం నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పొల్యూషన్ తదితర శాఖల అధికారులు సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆ నిర్వాహకులకు అధికారుల మధ్య ఒప్పందాలు ఉన్నాయనే సందేహాలకు తావిస్తోంది.
Venkateshwara stone crusher land victims protest :
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కు సైతం భూ బాధితులు తమ సమస్యను పరిష్కారించాలని మొర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపివడం కూడా అనుమానాలకు తావిస్తోంది. పదుల సంఖ్యలో ఉన్న భూ బాధితులకు పరిహారం చెల్లించడంలో మొండిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యాజమాన్యం తీరు చర్చానీయాంశంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి భూ బాధితులకు పరిహారం అందేలా చూడాల్సిన బాధ్యత ఉందని పలువురు భావిస్తున్నారు.