
- సీసీఐ కొనుగోళ్లు క్లోజ్…ఇక తమకేం ఢోకా లేదనే ధీమాలో సదరు మిల్లు యాజమాన్యం ఉన్నట్లు ప్రచారం…
- ఆ “మిల్లు” మాయాజాలంపై పర్యవేక్షణ నిల్..!
- ఇదే తరహాలో సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన కాటన్ మిల్లుల వ్యవహారం ఉన్నట్లు ఆరోపణలు…
- గత కొనుగోళ్ల తీరు పట్ల సమగ్రమైన విచారణ చేపడితే అసలు బండారం బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు…
- వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని “ఎమ్మెల్యే” ఆశించినా అందుకు భిన్నంగా సీసీఐ కొనుగోళ్లు జరిగినట్లు ప్రచారం…
దారా స్పెషల్ కరస్పాండెంట్ / జన నిర్ణయం
Magic in CCI purchases in cotton Mills: అక్కడ నిబంధనలు బేఖాతరు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందనే ప్రచారం ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI )తో మిలాఖత్ కావడం వారికి చిటికెలో పనేనట. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయడంలోనూ దిట్టేనట. దీంతో “CCI ” కొర్రీలతో పంట ప్రయివేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడిందని తెలుస్తోంది. నాణ్యత లేమి, తేమ శాతం పేరుతో Hanumakonda district parakala హనుమకొండ జిల్లా “పరకాల”లోని ఓ మిల్లులో యధేచ్ఛగా గోల్ మాల్ జరుగినట్లు ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పరకాల పట్టణం ఎంట్రీలో ఉండే ఆ మిల్లువైపు తొంగి చూసే అధికారులు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. మరోవైపు సీసీఐ కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనేది బహిరంగ రహస్యమే. దీంతో వారు పెట్టే కొర్రిలతో పంటను “ప్రయివేటు” కు అమ్ముకోవాల్సిన అనివార్య పరిస్థితులు రైతులకు ఏర్పడినట్లు పలువురు భావిస్తున్నారు.
Magic in CCI purchases in cotton Mills:
అయితే ప్రస్తుతం ఆ మిల్లులో CCI కొనుగోళ్లు క్లోజ్ కావడంతో ఇక తమకేం ఢోకా లేదనే ధీమాలో సదరు మిల్లు యాజమాన్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ కాటన్ మిల్లులో CCI కొర్రీల”కత”కంచికే చేరిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరహాలో సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన కాటన్ మిల్లుల వ్యవహారం సైతం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ మిల్లులో CCI ద్వారా కొనుగోలు జరిగిన తీరు పట్ల ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Magic in CCI purchases in cotton Mills:
మరోవైపు వ్యవసాయ మార్కెట్లోనే CCI ద్వారా కొనుగోలు చేయాలని “ఎమ్మెల్యే” (mla )ఆశించినప్పటికీ అందుకు భిన్నంగా CCI కొనుగోళ్లు జరిగినట్లు ప్రచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ పరకాల ఎంట్రీ లో ఉండే సదరు మిల్లులో జరిగిన సీసీఐ కొనుగోళ్ల తీరు పట్ల సమగ్రమైన విచారణ చేపట్టి ఉన్నతాధికారులు తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని, CCI పట్ల రైతులకు నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ఉందని రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, పలువురు రైతులు భావిస్తున్నారు.