
February 7 madiga maha sabha : మాదిగల మహా యుద్ధభేరిని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా శాయంపేట మండల స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముక్కెర. ముఖేష్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ నేతృత్వంలో అనగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మహాజన సోషలిస్టు పార్టీ మండల అధ్యక్షుడు మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో డబ్బులు కొట్టి పోస్టర్ ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాల కాలంలో ఎంతోమంది అనగారిన బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యశ్రీ ,ఒంటరి మహిళ, వితంతువులకు ,వికలాంగులకు, పెన్షన్స్ సౌకర్యం వస్తుందంటే కేవలం కృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం అని అన్నారు .మాదిగ ఉప కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎవరూ వర్గీకరణ చేయకముందే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి వర్గీకరణ చేయకుండా మాలలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్న సందర్భంగా ఈనెల 7న హైదారాబాద్ లో జరగబోయే లక్ష డబ్బులు వేల గొంతుకల మహ యుద్ధబేరిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తుడుం వెంకటేష్ మాదిగ, అరి కిల్ల దేవయ్య మాదిగ, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ మాదిగ, మారేపల్లి నందం ,అరికెల ప్రసాద్, పశుల ప్రవీణ్ కుమార్ ,దైనం పల్లి పాపయ్య ,మారపల్లి మోహన్, రంగబాబు, తల్లి దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.