
- సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
- ఎమ్మెల్యేల కలయికను తప్పుడు కథనాలుగా ప్రచారం చేశారంటూ సీరియస్
- ప్రభుత్వం పట్ల బురదజల్లే ప్రయత్నమంటూ మండిపాటు…
Mla naini rajender reddyserias to social media news : సామజిక మధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఎమ్మెల్యేల సమావేశంపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. కావాలనే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. తోటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి తను వెళ్లినట్టు, ముఖ్యమంత్రి, మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని తన ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని వెనుకాల ఉన్నవాళ్లను తప్పకుండ శిక్షించాలన్నారు. యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ప్రభుత్వంపై విషంజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కోడిగుడ్డుపై ఇకలు పీకే చర్యలను మానుకోవాలని హితులు పలికారు.
Mla naini rajender reddy serias to social media news :
సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని, వారేమైనా బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కదా అని ప్రశ్నించారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయాంపై సమగ్ర విచారణ జరిగిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆ లేఖను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాకు రిలీజ్ చేశారు. ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దాఖలాలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.