
Hanumakonda district shayampet mandal శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల లో అంబేద్కర్ సామాజిక సేవాసమితి అధ్యక్షులు గజ్జి సదయ్య ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగం -ప్రాథమిక హక్కులు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. ఇందులో ద్వితీయ తృతీయ విజేతలను ఎంపిక చేయడం జరిగినది. ప్రధమ బహుమతి ఏ. ఝాన్సీ రాణి, ద్వితీయ బహుమతిని ఏ .చందన, తృతీయ బహుమతిని ఎం. చరన్, గెలుచుకోవడం జరిగినది. వీరికి బహుమతుల ను తుడుం శంకర్ మరియు వైద్యుల తిరుపతిరెడ్డి అందించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి విజయ్ కుమార్, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.