
Warangal fci ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఫూడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)మేనేజర్లలు ధీరాజ్ కుమార్, శ్రీధర్, శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని కాజీపేటలోని ఎఫ్‌సీఐ ఆఫీస్‌లో 76వ గణతంత్ర దినోత్సవం వేడులక సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత మేనేర్లలు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌సీఐ స్టాఫ్ సి.జగదీశ్వర్, ఐత రాజు, సత్యదేందర్, రాజ్‌కుమార్, సురేష్, శంకర్, ఉమార్, వెంకీ, ఎఫ్‌సీఐ డిపిఎస్ లేబర్, సెక్యూర్టీ గార్డ్స్ తదితరులు ఉన్నారు.