
సద్దుమణిగేలా చేసిన స్థానిక పోలీసు బృందం
Warangal district వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో జరిగిన గ్రామ సభ గందరగోళంగా మారింది స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, ఎంపీడీవోశ్రీవాణి , ఏఈఓ,తిరుపతి, స్థానిక ఎస్సై, రాజేష్ రెడ్డి, లా ఆధ్వర్యంలో, పంచాయతీ కార్యదర్శి రాజు, గ్రామ సభను శనివారం నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన గ్రామసభ ముందుగా ప్రశాంతంగానే మొదలైనప్పటికీ అధికారులు లబ్ధిదారుల జాబితాను చదవడం మొదలు పెట్టారు. జాబితాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని అర్హులు 2023– 24 సంవత్సరం నాటికి కనీసం 20 పని దినాలు పని చేసి ఉండాలి అనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాపయ్యపేట గ్రామంలో అర్హులు 92 మంది జాబితాను , ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి తెలియజేశారు.ఇం దిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఆన్లైన్లో 778 మంది చేయగా, డాబా ఇల్లు ఉన్నవాళ్లను తీసివేసి, నిజమైన అర్హతలు కలిగిన వారు 336 ను గుర్తించారు. రైతు భరోసాలోని భాగంగా గతంలో ఉన్న రైతులు అందరూ అర్హులుగా ఉండేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకారంగా కొత్తగా 37 మంది మీ సేవ ద్వారామొత్తం 42 అర్హులను, వ్యవసాయ శాఖ నుంచి గుర్తించామని, ఏఈఓ తిరుపతి తెలియజేశారు. దీంతో అక్కడికి హాజరైన గ్రామ ప్రజలు అధికారులను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తుండగానే అధికార పార్టీ నాయకుల మరియు ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్యన వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో గ్రామ సభ మొత్తం రసభసగా మారింది. అక్కడే ఉన్న స్థానిక ఎస్సై రాకేష్ రెడ్డి కల్పించుకొని ఇరుపక్షాల వారిని సద్దుమణిగేలా ప్రయత్నాలు చేసి సభను సజావుగా జరిగే విధంగా కృషి చేశారు.