
“జన నిర్ణయం” క్యాలెండర్ ఆవిష్కరించిన సీనియర్ పొలిటీషియన్, రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ “నాగుర్ల వెంకటేశ్వర్లు”
Jananirnayam calendar inagaretion: ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ “జన నిర్ణయం” జనపక్షం నిలువడంలో ముందుంటుందని సీనియర్ పొలిటీషియన్, రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ ఛైర్మన్ “నాగుర్ల వెంకటేశ్వర్లు” అన్నారు. 2025కు సంబంధించిన జన నిర్ణయం క్యాలెండర్ ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ప్రతి అక్షరం ప్రజల పక్షం అనేలా జన నిర్ణయం ముందుకు సాగడం అభినందనీయం అని పేర్కొన్నారు. ప్రజల గొంతును వినిపించడంలో ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఇప్పటికే ప్రజాదరణ పొందిన జన నిర్ణయం పత్రిక మరింత ప్రజల సపోర్ట్ తో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జన నిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్, మిద్దెపాక రవీందర్, పవిత్రన్ తదితరులు పాల్గొన్నారు.