
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే గ్రామ సభలలో ఆర్హుల జాబితా అని ప్రకటిస్తూ లబ్ధిదారులను గుర్తించకుండా పథకాల అమలుకు పూనుకోకుండా ప్రచార ఆర్భాట చేస్తున్నారని ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఎన్నికల హామీల అమలుపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే లబ్ధిదారులను గుర్తించి అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం ఎంసీపీఐ(యు) నర్సంపేట పట్టణ యువజన ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ ఈర్ల రాజు అధ్యక్షతన స్థానిక నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నప్పటికీ ఆరు గ్యారెంటీ ల అమలు అందని ద్రాక్ష గానే మిగిలిందన్నారు ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలుకు పూనుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హులైన పేదలకు ఇండ్లు స్థలాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని మరోవైపు పేదలకు చెందాల్సిన వివిధ రకాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతూ రియాల్టర్లు అమ్మకాలకు కొనుగోళ్లకు పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే లేడన్నారు. పైగా ప్రభుత్వ భూమి రక్షించాల్సిన అధికార పార్టీ నాయకత్వమే కాపాడాలని ప్రకటనలు గుప్పించడం చోద్యంగా ఉందన్నారు. గ్రామ సభలలో లబ్ధిదారుల జాబితాను గుర్తించి పథకాలను వర్తింప చేయాల్సింది పోయి కేవలం ప్రచార సభలుగా మార్చి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నిరసనల పేరుతో ఉనికి కాపాడుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నాయని ఈ క్రమంలో అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ భూములను రక్షించి పేదలకు పంచి ప్రజాపాలనగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు లేకపోతే ప్రజా పోరాటాలు తప్పవని భూ కబ్జాలకు వ్యతిరేకంగా భూ పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల యాకయ్య మోటం సురేష్ బండారు మల్లేష్ బంగారి సందీప్ కసుబాల సతీష్ కాజా మియా రాజు శివ వెంకన్న ముత్తయ్య రాజేష్ తదితరులు పాల్గొన్నారు.