
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Women should be developed in all fields:
Hanumakonda district shayampet mondal శాయంపేట రైతు వేదికలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) వారి సహకారంతో ప్రజ్వల్ సంఘం శాయంపేట వారి నిర్వహణలో ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు mla gandra satyanaraya Rao హాజరై కుట్టు మిషన్లు మహిళలకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కుట్టు మిషన్ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు.
Women should be developed in all fields:
లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలని ప్రభుత్వం ఈనెల 26 నుంచి 4 కొత్త పథకాలు అమలు చేయనున్న నేపథ్యంలో అర్హులైన వారిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలన చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పెద్దకోడపాకలో నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ స్వయంగా పరిశీలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 26న రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నాలుగు పథకాలకు సంబంధించి సర్వే జరుగుతున్న విషయం ముందస్తు సమాచారం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా అక్కడున్న ఎంపీడీవో ఇతర అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఎంపీడీవో ని అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. వెంటనే హన్మకొండ జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎంపీడీవో పనితీరు సరిగా లేదని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలను సమన్వయం చేసుకొని సమాచారం సేకరించాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డ్ మెంబర్ బాసాని చంద్రప్రకాష్ మాజీ ఎంపిటిసిలు జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు