
Jayashankar bhupalapally district జయశంకర్ భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సంబురాల్లో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూలాల సాంబయ్య, తిరునగరి పద్మ, విజయకుమార్, లావణ్య, మల్లికార్జున్, మహమ్మద్ రఫీ, గడ్డి పద్మ, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హరిదాసు వేషధారణలో చిన్నారి చిట్టి పొట్టి విద్యార్థి దండు రిషి వర్ధన్, ఆరబోయిన రక్షిత, తదితర విద్యార్థులు పతంగులు ఎగరవేసి ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.