
Warangal district వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాలలో పాఠశాల యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపిడిఓ జి.నరసింహమూర్తి, ఎంఈఓ అంబి వసంత ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాల క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో వీరితోపాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్లు గోనె శ్రీదేవి, ఆసం చంద్రమౌళి, నాగరాజుపల్లి, మామిండ్లవీరయ్యపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శులు డాక్టర్ విష్ణు, సుధాకర్, పాఠశాల సహోపాధ్యాయులు ఉడుత రాజేందర్, కునమల్ల రాజన్ బాబు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పి ఆర్ టి యు మండల అధ్యక్షులు నకిరెడ్డి మహేందర్, ప్రధాన కార్యదర్శి ఉడుత రాజేందర్ కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఫోటోలతో క్యాలెండర్ లను తయారుచేయించడమే కాకుండా ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఉపాధ్యాయుడిగా నియామకమై, తాను తీసుకున్న మొదటి జీతం నుంచి క్యాలెండర్స్ అందజేసిన ఉపాధ్యాయుడు రాజన్ బాబు ను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నకిరెడ్డి మహేందర్, ఉడుత రాజేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ శ్రీమతి ఎరుకల వెంకటలక్ష్మ, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, ఆసం చంద్రమౌళి, ఉపాధ్యాయులు రాజన్ బాబు, అశోక్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.