
- “ఐనవోలు మల్లన్న” జాతర ఏర్పాట్లలో జాప్యం…
- జిల్లా మంత్రి ప్రత్యక్షంగా లేకుండానే సమీక్ష సమావేశం…
- వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించిన మంత్రి…
- కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పాలకుల సమన్వయ లోపం..!
- యాక్షన్ ప్లాన్ లేదు…. కనీసం వాల్ పోస్టర్ కూడా లేకపోవడం పట్ల సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు…
- జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు…
Hanumakonda district హనుమకొండ జిల్లాలో పత్రిఏటా అత్యంత వైభవంగా జరిగే inavolu mallana jathara ఐనవోలు మల్లన్న జాతర ఈ ఏడాది వన్నె తగ్గుతోంది. లక్షలాది భక్తులు హాజరయ్యే జరత ఏర్పాట్లలో జాప్యం జరుగుతోంది. జాతర నిర్వాహణకు పట్టుమని వారం కూడా లేని సమయంలో హడావుడిగా సమీక్ష సమావేశం నిర్వహించడమే జాతర పట్ల ఏ ఈఏడాది నిర్లక్ష్యం జరుగుతుందనడానికి సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు. కనీసం ఒక నెలరోజుల ముందే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో యాక్షన్ ప్లాన్ జరుగాల్సి ఉంది. జాతర ప్రణాళికకు సంబంధించిన వాల్ పోస్టర్ కూడా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సారి ఆ ఊసే కానరాకపోడం గమనార్హం. మరోవైపు మంగళవారం జాతరను విజయవంతం చేయాలని వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా శాఖల అధికారులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. జాతర బ్రహ్మోత్సవాలు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికార యంత్రంగం తలలు పట్టుకున్నారని పలువురు భావిస్తున్నారు.
జాతరలో ఎక్కడ సమస్యలు ఎక్కడ నిలిచిపోవడం, ఇంతవరకు ధర్మకర్త మండలి కమిటీ ఏర్పాటు కూడా లేకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారుల పనితీరు సరిగా లేదని గత జాతరను దృష్టిలో పెట్టుకొని అధికారుల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- జిల్లా మంత్రి ప్రత్యక్షంగా లేకుండానే సమీక్ష సమావేశం…
సమీక్ష సమావేశంలో దేవదయ శాఖ మంత్రి
ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం చర్చానీయాంశంగా మారుతోంది.
దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యక్షంగా సమీక్ష సమావేశంలో కానరాకపోవాడంతో పలు విమర్శలకు తావిస్తోంది. అయితే సమీక్ష సమావేశం మధ్యలో వీడియో
కాన్ఫరెన్స్ లో మంత్రి జాతర విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచనలు, ఆదేశాలు జారీ చేయడం ఒకభాగమైతే, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి జాతర నిర్వాహణలో సమన్వయం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత కీలకంగా భావించే ఐనవోలు మల్లన్న జాతర అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యే సమన్వయలోపం వల్ల ఈ ఏడాది వన్నె తగ్గిపోతుందనే అభిప్రాయాల్లో అబద్దం మాత్రం లేదు.