
- ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఆస్తిని కూలగొట్టి పర్మిషన్ ఇస్తున్న అధికారులు…
- ప్రయివేట్ కట్టడాల కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న అధికారులు…
- ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సందర్శన
- కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్న మాదిగల ఐక్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెపాక రవీందర్
ప్రయివేట్ కట్టడాల కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇట్టి దుశ్చర్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని మాదిగ ఐక్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు విద్యాపాక రవీందర్ డిమాండ్ చేశారు. Wardhannapet వర్ధన్నపేట మున్సిపాలిటీ ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై నిర్మించిన డివైడర్ను ప్రైవేటు వ్యక్తుల కోసం అక్రమంగా తొలగించిన ప్రదేశాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మాదిగ ఐక్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దపాక రవీందర్ , రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు , టిఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మరిపట్ల అంజయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈరెల్లి శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ వివేకానంద, మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మారపల్లి ఎల్లయ్య బృందం సందర్శించి పరిశీలించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం లో నూతనంగా మున్సిపాలిటీ అయిన తర్వాత రహదారుల విస్తరణ సుందరీకరణలో భాగంగా సుమారు రెండు కోట్ల రూపాయలతో సెంటర్ లైటింగ్ డివైడర్లను సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కొంతమంది వ్యాపారస్తుల అభివృద్ధి కోసం ప్రైవేట్ కట్టడాల కోసం జాతీయ రహదారిలో నిర్మించిన సుమారు 500 మీటర్ల 50 లక్షల విలువగల డివైడర్లను ఎలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం దారుణం అన్నారు. రోడ్డు వెడల్పు లో ఎంతోమంది పేద ప్రజల ఇళ్లను కూల్చివేసి అభివృద్ధికి సహకరించాలని కోరితే నేటికీ సొంత ఇల్లు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. అలాంటి వారిని గ్రామ అభివృద్ధి కోసం ఇబ్బందులు ఒకవైపు పడతా ఉంటే మరోవైపు వ్యాపారస్తుల కట్టడాల కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నప్పటికీ అధికారులు చూస్తూ ఉండడం సరైన పద్ధతి కాదని వారన్నారు. ఇట్టి విషయంపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి డివైడర్ను ధ్వంసం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతామన్నారు.