
- గిరిజన విద్యపై కరువైన అధికారుల పర్యవేక్షణ..!
- ఇందుకు “సోమ్లాతండా” గిరిజన ప్రాథమిక పాఠశాలే సాక్ష్యం..!!
- పాఠం చెప్పని, బడిలో సమయం కేటాయించని టీచర్ పై విచారణ శూన్యం…!!
- సంబంధిత ఐటిడిఎ అధికారులకు ఫిర్యాదు చేయనున్న విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు...
Mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని somlathanda సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉత్తుత్తి విద్యా సాగుతోంది. ఆ పాఠశాల టీచర్ పాఠం చెప్పేది లేదు, బడిలో సమయం కేటాయించేది లేదనేది బహిరంగ రహస్యమే. దీంతో గిరిజన విద్యా కుంటుపడుతుందని, గిరిజన విద్యాపై, గిరిజన పాఠశాల నిర్వాహణపై సంబంధిత ఐటిడిఎ అధికారుల పర్యవేక్షణ కరువైందని విద్యార్థి యువజన ప్రజాసంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇందుకు somlathanda సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో సదరు టీచర్ వ్యవహరించే తీరే సాక్ష్యంగా నిలుస్తోందని అభిప్రాయపడుతున్నారు. పాఠం చెప్పని, బడిలో సమయం కేటాయించని టీచర్ పై విచారణ శూన్యంగా ఉండటం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఆశీస్సులతోనే సదరు టీచర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే ములుగు జిల్లాలోని పలు విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు, గిరిజన విద్యా అభివృద్ధిని కోరుకునే సంస్థలు సంబంధిత ఐటిడిఎ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ mulugu district ములుగు జిల్లా somlathanda సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల నిర్వాహణపై అక్కడి విద్యార్థుల సంఖ్య, టీచర్ నిర్వహించే విధుల పట్ల అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
——————
- అధికారుల మౌనం వెనుక మతలబేంటి..!?విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు, గిరిజన విద్యా అభివృద్ధిని కోరుకునే సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలతో పూర్తి కథనం రేపటి “జన నిర్ణయం” పత్రికలో….