
- అర్షం అశోక
Telangana state తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో cm revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారము ఆరు గ్యారంటీలలో భాగంగా రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసు కుని చేపట్టిన సర్వే అన్ని జిల్లాలో జోరుగా సాగుతోంది ఆత్మకూర్ మండలం, నీరుకుళ్ళ గ్రామంలో శనివారం గ్రామ కార్యదర్శి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి సర్వే నిర్వహించారు ఈసర్వేను టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్ పరిశీలించారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే అధికారులు.దరఖాస్తుదారుడి అన్ని వివరాలను సేకరిస్తారని ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎలాంటి ఆరోపణలు రాకుండా.. తప్పులు జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారని ప్రతి దరఖాస్తుదారునికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎవరు దిగులు పడకూడదని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ బిల్ కలెక్టర్ విష్ణు,మాజీ సర్పంచ్ వక్కల కుమార్, మాజీ వార్డ్ మెంబర్ అర్షం రాజ్ కుమార్ దుర్శెట్టి శ్రావణ్ సోషల్ మీడియా ఇంచార్జ్, యువజన నాయకుడు అర్షం రాజుకర్,అర్షం శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది అర్షం రవిందర్ తదితరులు పాల్గొన్నారు