
అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేశారంటూ ఆరోపణలు..?
డీవియేషన్ ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేని టౌన్ ప్లానింగ్..?
“ముకుంద జ్యూవెల్లర్స్” బిల్డింగ్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధం అంటూ ప్రచారం…
ఇప్పటికే సదరు బిల్డింగ్ కు నోటిసులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు…
“ముకుంద జ్యూవెల్లర్స్” ఇదో పేరుపొందిన బంగారు నగల దుకాణం. పేరుకు పెద్ద జ్యులరీ షాప్ వివిధ ప్రాంతాల్లో విస్తరించిన సంస్థ. కానీ ఆ సంస్థ పేరు ఇప్పుడు మసకబారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే “ముకుంద జ్యువెలరీ” బిల్డింగ్ నిర్మాణం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఎంతో గొప్పగా నేడు హనుమకొండ చౌరస్తాలో ప్రారంభమైన సదరు జ్యువెలరీ షాప్ బిల్డింగ్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు బంగారు నగల దుకాణం బిల్డింగ్ ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. బంగారు నగల షాపు యాజమాన్యానికి బిల్డింగ్ అనుమతుల వివరాలు తెలియనందునే సదరు బిల్డింగ్ యాజమాన్యం తో అగ్రిమెంట్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమకొండ “ముకుంద జ్యూవెల్లర్స్” బిల్డింగ్ అసలు కథ ఏమిటి..?సమగ్రమైన కథనం జన నిర్ణయం పత్రిక రేపటి సంచికలో…